Tuesday, January 21, 2025

ఎపి కొత్తగా 679 ఎంఇఒ పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

AP Govt notification released to 679 MEO Posts
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఎంఇఒ పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఇఒ 1 పేరిట 13, ఎంఇఒ -2 పేరిట కొత్తగా 679 పోస్టులను ఏర్పాటు చేస్తూ పాఠశాల ఎపి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖలో బోధన, బోధనేతర అంశాల పర్యవేక్షణకు గానూ కొత్త పోస్టులను కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. ప్రస్తుతం ఉన్న 666 ఎంఇఒ పోస్టులకు అదనంగా 13 కొత్త పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే 679 ఎంఇఒ 2 పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎపిలో ప్రతీ మండలంలోనూ ఇద్దరు ఎంఇఒలు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న మండల విద్యాధికారి పోస్టును ఇక నుంచి ఎంఇఒ 1గా మార్పు చేశారు.

AP Govt notification released to 679 MEO Posts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News