Monday, December 23, 2024

ఎపి సీనియర్ ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరావుకు పోస్టింగ్..

- Advertisement -
- Advertisement -

AP Govt posting to Senior IPS AB Venkateswara Rao

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుకు సుదీర్ఘ విరామం తర్వాత ఎపి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఆయనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టిడిపి హయాంలో ఎపి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వహించిన ఎబివిని నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్దారన్న ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తన సస్పెన్షన్‌పై ఎపి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఎబి వెంకటేశ్వరరావుకు ఊరట కలిగిన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్ అధికారులను రెండేళ్లకు మించి సస్పెన్షన్‌లో ఉంచరాదన్న నిబంధనను ప్రస్తావించిన సుప్రీంకోర్టు తక్షణమే ఎబివికి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎపి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎబివికి రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt posting to Senior IPS AB Venkateswara Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News