Wednesday, January 15, 2025

సాగర్ నుంచి ఎపికి కొనసాగతున్న నీటి విడుదల.. భారీగా మోహరించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఎపికి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ డ్యాం వద్ద పెద్ద ఎత్తున ఎపి ప్రభుత్వం పోలీసులు మోహరించిది. దీంతో డ్యాం వద్దకు భారీగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేరుకుంటున్నారు. ఐజీస్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితి అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి.

నిన్నటి నుంచి ఇప్పటివరకు ఎపీ ప్రభుత్వం 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసింది. డ్యాం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 522 అడుగుల చేరువగా వచ్చింది. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, నిన్న ఓ వైపు తెలంగాణ మొత్తం ఎన్నికల మూడ్ లో ఉండగా.. ఎపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏకపక్షంగా నాగార్జున సాగర్ నుంచి తరలించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News