Wednesday, January 22, 2025

‘భోళా శంకర్’ మూవీకి ఎపి ప్రభుత్వం షాక్..

- Advertisement -
- Advertisement -

‘భోళా శంకర్’ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా, రేపు(ఆగస్టు 11న) రిలీజ్ కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఇటీవల జగన్ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శలు చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో వైసిపి మంత్రులు చిరుపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ‘భోళా శంకర్’ మూవీ టికెట్ల పెంపు విషయంలో ఎపి ప్రభుత్వం ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News