Wednesday, January 22, 2025

చంద్రబాబుకు షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు భారీ షాక్ తగిలింది. ఏపిలో అయన విడిది చేసే కరకట్ట గెస్ట్‌హౌస్‌ను ఆంధప్రదేశ్ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారుల చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ,అప్పటి మంత్రి నారాయణ తమ పదవులను దుర్వినియోగంవ చేసి క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపధ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. సిఆర్‌డిఏ మాస్టర్ ప్లాన్ ,ఇన్నర్‌రింగ్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవరకలకు పాల్పడి , అందుకు బదులుగా కృష్ణానది సమీపాన కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలు ఉన్నాయి.

చట్టాలను , కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను , సాధికారణ ఆర్ధియ నియామకాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు , ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలు ఉన్నాయి. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ను పొందారని చంద్రబాబుపైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో క్రిమినల్ లా అమెండ్‌మెంట 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సిఐడి కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు నాయుడు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. ఈ గెస్ట్‌హౌస్‌తోపాటు మాజీ మంత్రి నారాయణ బంధువుల ఆస్తులు , బ్యాంకు ఖాతాల్లోని నగదును సిఐడి అటాచ్ చేసింది.

నారాయణ కుటుంబ సభ్యులు ,బినామిలకు చెందిన 75,880 చదరపు అడుగుల ఆస్తులు అటాచ్ చేసింది. నారాయణ భార్య రమాదేవి ,అల్లుడు పునీత్ ఆస్తులు ఇందులో ఉన్నాయి. లింగమనేని రమేష్ బినామిగా చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆయనకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌ను కూడా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. తన ఆస్తుల విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారని ఆరోపణలు వచ్చాయి.లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. రాజధానిలో బినామి పేరుతో టిడిపి నేతలు భూములు కొనుగోలు చేశారని ,రాజధాని ప్రాంతలో నారాయణ భూములు కొన్నారని ఆరోపణలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News