Monday, December 23, 2024

ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు సిద్ధం: సజ్జల

- Advertisement -
- Advertisement -

AP Govt will meet with Employees on PRC

 

అమరావతి: ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పిఆర్‌సి విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమ్మె చట్టవిరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. చర్చలకు వెళ్లాలని నేతలకు ఉద్యోగులు చెప్పాలన్నారు. ఉద్యోగులు లేఖ ఇచ్చిన రోజే ఇవాళ చర్చిద్దామని చెప్పామని, ఇంతవరకు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రాలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News