Sunday, December 22, 2024

గ్రూప్-1 మెయిన్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

ఎపిలో 2018 నాటి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు మార్చి 13న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం తాజాగా స్పందించింది. హైకోర్టు తీర్పుపై గ్రూప్-1 ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చింది. ఉద్యోగుల తరఫున న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఎపిలో 2018లో ఎపిపిఎస్‌సి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో (2018లో) జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

మొదటిసారి దిద్దిన ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా రెండోసారి మూల్యాంకనం చేసి నచ్చిన వారిని ఎంపిక చేసి ఎపిపిఎస్‌సి ఫలితాలను వెల్లడించిందని వారు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ మార్చి 13న తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఎపిలో 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి 2018 మే 26న ఎపిపిఎస్‌సి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 80250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు, పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకు ’గ్రూప్-1’ మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. వీటి ఫలితాలను వెల్లడించి, ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. తాజాగా హైకోర్టుల మెయిన్స్ పరీక్షను రద్దుచేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News