Wednesday, January 22, 2025

చంద్రబాబుకు భారీ ఊరట..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ను ఎపి హైకోర్టు మంజూరు చేసింది. ఐఆర్ ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం ప్రకటిం చారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు ఇలా పలు కేసుల్లో సిఐడి వరుసగా కేసులు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను కూడా ఏపీ హైకోర్టు మంజూరు చేసింది . ఇక, ఐఆర్‌ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గతంలో హైకోర్టు విచారణ జరిపి తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటి షన్‌పై తీర్పు ఇవవాల్సి ఉన్నందున విచారణ జరగడం లేదు. కానీ ఆ కేసులో అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది. సిఐడి తనపై నమోదు చేసిన కేసులు పూర్తిగా కుట్ర పూరితమని ఒక్క సాక్ష్యం లేకండా తప్పుడు ఆరోపణతో కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తనపై కేసులు నమోదు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని తనకు సెక్షన్ 17ఎ వర్తిస్తుం దని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీని యర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, ఎపి సర్కార్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అక్టోబర్ 18వ తేదీన ఈ క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేశారు. ఇంత కాలం తీర్పు వెల్లడించలేదు. ఎప్పుడు వెల్లడిస్తారో స్పష్టత లేదు.ఈ లోపు చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News