Thursday, April 3, 2025

బిగ్‌బాస్‌ షో పై ఎపి హైకోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

AP High Court is serious about Bigg Boss

మనతెలంగాణ/హైదరాబాద్ : బిగ్ బాస్ రియాల్టీ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. టివి షోలు ఇండియన్ ’బ్రాడ్ క్రాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) నిబంధనలు పాటించడం లేదని అన్నారు. దీనిపై స్పందించడానికి కేంద్రం తరపున న్యాయవాది సమయం కోరారు.

బిగ్‌బాస్‌లో అశ్లీలతపై ఎపి హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని తెలిపిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని పేర్కొంది. విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది. అశ్లీలత ఎక్కువగా ఉందని కోర్టుకు వివరించారు. బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, సిపిఐ నేత నారాయణలు బిగ్‌బాస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షో కాదని.. బూతు షో అని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ షో చూడలేని పరిస్థితి ఉందని.. అశ్లీలతతో ఉందన్నారు. ఈ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News