Saturday, December 21, 2024

గ్రూప్‌-1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

2018 ఎపిపిఎస్సి గ్రూప్‌-1 పరీక్ష రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కొనసాగుతారని డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెల్లడించింది. ఇటీవల గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పరీక్ష రద్దుపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎపిపిఎస్సి డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. దీంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దుపై తాత్కాలికంగా డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణ మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు యధావిధిగా ఉద్యోగులు తమ విధుల్లో కొనసాగుతారని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News