మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఎపి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బుధవారం డివిజన్ బెంచ్ కొట్టివేయడంతో పాటు ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఇసిని హైకోర్టు ఆదేశించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ విధించలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం,బిజెపి, జనసేన దాఖలు చేసిన పిటిషన్లను విచారణ చేసిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌ఇసి ని ఆదేశించారు.పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు మంగళవారం అప్పీల్ చేశారు. ఈ వివాదంపై విచారించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది.
AP High Court permission for Parishad Elections