అమరావతి: దిశ చట్టం చట్ట బద్ధత కల్పించారా లేదా గుండెలపై చేయి వేసుకుని చెప్పాలని ఎపి హోం మంత్రి వంగలపూడి అనిత వైఎస్ఆర్ సిపి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దిశ చట్టం, యాప్ పై శాసన మండలిలో అనిత మాట్లాడుతూ… దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలను రక్షించారో వైసిపి సభ్యులే చెప్పాలని డిమాండ్ చేశారు. శక్తి యాప్ తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించబోతున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున శక్తి యాప్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారని చెప్పారు. మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసేందుకు సిఎం అంగికరించారని వెల్లడించారు. గంజాయి నివారణకు ఈగల్ అనే సాఫ్ట్ వేర్ రూపొందించి అమల్లోకి తెచ్చామని, దిశ యాప్ డౌన్ లోడ్ కోసం గత ప్రభుత్వం టార్గెట్లు పెట్టడంతో పాటు మగవాళ్లతోనూ యాప్ డౌన్ లోడ్ చేయించారని హోంమంత్రి అనిత విమర్శలు గుప్పించారు. దీంతో హోమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసిపి ఎంఎల్ఎలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా దినోత్సవం రోజున ఆ యాప్ ను తీసుకొస్తాం: అనిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -