అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం ఇంటర్ విద్యార్థులు 9,41,358 మంది ఉన్నారు. 8,69,058 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,45,358 మంది విద్యార్థులు హాజరు కాగా 2,41, 599 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 54% శాతంగా ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫరీక్షలకు 4,23,455 మంది విద్యార్థులు హాజరయ్యారు. సెకండ్ ఇయర్ లో 2,58,449 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ ఇయర్ లో ఉత్తీర్ణత శాతం 61%గా ఉంది. ఒకేషనల్ కోర్సులకు హాజరైన విద్యార్ధుల సంఖ్య 72,299 గా ఉంది. ఫస్ట్ ఇయర్ లో బాలురు 49 శాతం, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించగా సెకండ్ ఇయర్ లో 59 శాతం బాలురు, 68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 75 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 55 శాతం ఉత్తీర్ణతతో కడప చివరి స్థానంలో ఉంది.
ఎపి ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎపి ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి