తక్షణమే ఆపాలంటూ
కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
బ్రహ్మ సాగర్ ఎడమకాలువపై
లిప్టులు విభజన చట్టాలకు
విరుద్ధమని స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి ప్రభుత్వం బ్రహ్మసాగర్ ఎడమకాలువపై అక్రమంగా ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తోందని తెలంగాణ మంగళవారం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కడపజిల్లా కాశినాయన మండలంలోని తెలుగుగంగ ప థకం అంతర్భాగంగానిర్మించిన బ్ర హ్మసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రారంభమయ్యే ఎడమ కాలువపై ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టినట్టు బోర్డు కు తెలిపింది. ఎడమ కాలువ 20. 550కి.మీ వద్ద, 24.900కి.మి వద్ద, 32.00కి.మీ వద్ద ఈ ఎత్తిపోతలను చేపట్టినట్టు తెలిపింది. ఇటుగుల పాడు, సావిశెట్టిపల్లె, కొండరాజుపల్లి, వరికుంట్ల, గంగనపల్లి గ్రామాల పరిధిలో ఈ పనులకు ఎపి టెండర్లు కూడా పిలిచినట్టు తెలిపింది. వి భజన చట్టాలకు విరుద్ధంగా ఏపిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదని, పెన్నా బేసిన్ పరిధికి కృష్ణా జలాలను తరలిస్తోందని అభ్యంతరం తెలిపింది. ఎపి చర్యలతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు సమస్యలు ఏర్పడతాయని, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు కలుగుతాయని వివరించింది. ఏపి చేపట్టిన ఈ ఎత్తిపోతల పథాకాల పనులను అడ్డుకోవాలని కృష్ణానదీయాజమాన్య బోర్డు చైర్మన్‌ను కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ రాశారు.