Monday, December 23, 2024

ఎపిలో పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితికి నానాటికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మెండా కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఎపి మంగళగిరి రోడ్డులోని బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, వైసిపి అసమర్ధ పాలనలో రాష్ట్రం అదోగతి పాలైందని మండిపడ్డారు.టిడిపి,వైసిపి పాలనలతో విసిగి వేసారిపోయిన ప్రజానీకం బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు.

బిఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సారథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అనంతరo అద్దంకి, గుంటూరు, పెనమలూరు, నందిగామ నియోజకవర్గాలకు చెందిన యువత జి.జయప్రకాష్, కె. రాకేష్, ఎస్. సురేష్ బాబు, ఎస్. సంగమేశ్వర్ రావు, కె.చినబాబు,ఆర్.రోహిత్, ఎ. శ్రీనివాస్ రావు, ఆర్. జస్వంత్, కె. విశ్వతేజ్ తదితరులు బిఆర్‌ఎస్‌లో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News