Sunday, January 19, 2025

మంత్రి కెటిఆర్ సిఎం కావాలంటూ ఎపి వాసి బైక్‌యాత్ర

- Advertisement -
- Advertisement -

AP Man bike trip to become KTR CM

హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ తెలంగాణ రాష్ట్రానికి సిఎం కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలరాజ్‌గౌడ్ అనే ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ వచ్చే ఎన్నికల్లో మంత్రి కెటిఆర్ సిఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్ యాత్ర గురించి తాను స్థానిక ఎంఎల్‌ఎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని బాలరాజుగౌడ్ మీడియాకు వెల్లడించాడు. కెటిఆర్ సిఎం కావాలన్న తన యాత్రకు ఎంఎల్‌ఎ పిన్నెల్లి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించారని తెలిపాడు. ఈక్రమంలో కెటిఆర్ సిఎం కావాలని యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బాలరాజ్‌గౌడ్ తెలిపారు. మంత్రి కెటిఆర్ విధానాలు అద్భుతంగా ఉంటాయని, అందుకే ఆయన తన అభిమాన నేత అని వివరించాడు. ప్రజా సమస్యలపై మంత్రి కెటిఆర్ స్పందించే తీరుకు ఆయనకు అభిమానినయ్యాయని, తన అభిమాన నేత సిఎం కావాలని కోరుకోవడంలో తప్పేముందని బాలరాజు గౌడ్ మీడియాకు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News