Sunday, December 22, 2024

నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి, హీరో సుమన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన నిరా కేఫ్‌ను మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో ఏపి మంత్రిజోగి రమేష్,హీరో సుమన్. సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇది ఒక ఔషధమని దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు పలు పరిశోధనల్లో శాస్త్రీయంగా నిరూపితం అయ్యిందన్నారు. చాలా మంది నిరా పై దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చేతి వృత్తుల వారిని తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటుందని,గీత వృత్తి కార్మికుల కోసం నిరా కేఫ్‌ని అందుబాటులో కి తీసుకువచ్చామన్నారు. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ నిరా కేఫ్ ని ఏర్పాటు చేశారని,నీరా అంటే డ్రింక్ కాదని, దీన్ని అందరూ తాగవచ్చని హీరో సుమన్ అన్నారు. డయాబెటిస్‌కి ఎంతో మంచిదని,హెల్త్ అందరికి బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని ఉదాహరణగా తీసుకుని దేశవ్యాపంగా ప్రవేశ పెట్టాలని ఆకాంక్షించారు. ఆంద్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ దేవతలు తాగిన ఔషధం నిరా అని దీన్ని ప్రమోట్ చేసి ఔన్నిత్యం పెంచారన్నారు. ఆంద్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి వి ఏర్పాటు చేయాలని, సీఎం జగన్ దృష్టి కి తీసుకెళ్తాను.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News