Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరితే ప్రజలే బుద్ధి చెబుతారు

- Advertisement -
- Advertisement -

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని బిఆర్‌ఎస్ పార్టీలో చేరడంపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా స్పందించారు. మంగళవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఎవరని ప్రశ్నించారు. సెంటిమెంట్ పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్లే మళ్లీ వద్దనకున్న ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు.

దేశవ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న వారికి రాజధాని ఇవ్వడం ఎక్కడా జరగలేదని…కాని కుట్రపూరితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సినవేవీ ఈరోజు దాకా ఇవ్వని వారు మళ్లీ ంంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే వారికి, ఆ పార్టీలో చేరదలచుకున్నవారికి ఎలా బుద్ధిచెప్పాలో రాష్ట్ర ప్రజలకు తెలుసునంటూ రోజా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News