Sunday, December 22, 2024

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎపి మంత్రి సతీమణి… చంద్రబాబు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి సిఐతో దురుసుగా ప్రవర్తించారు. తనకు ఎస్కార్ట్‌గా రావాలని మంత్రి సతీమణి హుకుం జారీ చేశారు. ప్రభుత్వం జీతమే ఇస్తుందని కానీ వైసిపి వాళ్లు జీతం ఇస్తున్నారా? అని పోలీస్ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 30 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నానని మీరు ఎక్కడికి వెళ్లారని పొగరుగా మాట్లాడారు. పోలీస్ అధికారి సారీ మేడమ్ చెప్పిన కూడా ఆమె వినిపించుకోలేదు. ఎవరు తనతో ఎస్కార్ట్‌గా వస్తున్నారు అని పోలీస్ అధికారులను డిమాండ్ చేసి అడిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై సిఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డితో మాట్లాడి వివరణ ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకవస్తే చర్యలు తీసుకుంటామని బాబు హెచ్చరించారు. పోలీసుల పట్ల తన భార్య వ్యవరించిన తీరుపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానని వివరణ ఇచ్చారు.

courtesy rtv

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News