Thursday, January 23, 2025

ఎపి ఎత్తుగడ

- Advertisement -
- Advertisement -

తాగునీళ్ల పేరిట కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం

మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అను మతులు లేకుండానే కృష్ణానదీ జలాలను అక్ర మంగా ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. ఈ సారి తాగునీటి అవసరాల పేరుతో జాతీయ హరి త ట్రిబ్యునల్ కళ్లుగప్పేందుకు ప్రయత్నాలు చే స్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అం తర్భాగంగా తొలిదశ పేరుతో కొత్తగా పనులు ప్రా రంభించాలని నిర్ణయం తీసుకుంది. ఎపి జల వ నరుల శాఖ ఇందుకు అవసరమైన ఉత్తర్వుల ను కూడా జారీ చేసింది. కృష్ణానదిలో శ్రీశైలం ప్రాజె క్టు వెనుక జలాల ఆధారంగా రాయలసీమ ఎత్తి పోతల పథకం తొలిదశ పనులు చేపట్టేందు కు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ-ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదీగర్భంలో ఉన్న సంగమేశ్వరం వద్ద నుంచి ఎత్తిపోతల పథకం పనులకు ప్రతిపాదించింది. శ్రీశైలం రిజర్వాయ ర్‌లో నీటిమట్టం 800అడుగుల స్థాయి నుంచి కృష్ణానదీజలాలను ఎత్తిపోసుకునేందుకు తొలిద శ పథకం లక్ష్యాలను నిర్దేశించింది. ఇందుకోసం ఆరు భారీ పంపులను ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్క పంపు ద్వారా 2913క్యూసెక్కుల నీటి ఎత్తి పోత సామర్థ్ధంతో మొత్తం ఆరు పంపుల ద్వారా రోజకు 17484క్యూసెక్కుల నీటిని ఎత్తి పోసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నీటిని పోతి రెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ప్రారంభమ య్యే శ్రీశైలం కుడిప్రధాన కాలువలోకి తోడి పోసే విధంగా తొలిదశ పథకం డిజైన్లను రూపొం దిం చింది.

వర్షాకాలం ప్రారంభం కాగానే జూన్ నుంచి జులై నెల మధ్యకాలంలో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి మొత్తం 59 మే రకు కృష్ణానదీజలాలను తోడిపోసుకోసుకునేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో ఇ ప్పటికే ఉపయోగంలో ఉన్న పాత రిజర్వాయర్లను నింపుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. తమిళనాడులోని చెన్నైనగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కృష్ణానదీజలాల్లో కేటాయించిన 15టీఎంసీలకు కూడా కొత్త రంగు పులిమింది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్‌నుంచి కృష్ణా నదీజాలాలు చెన్నై నగరం దాకా చేర్చాలంటే మధ్యలో ఉన్న ప్రాజెక్టులు రిజర్వాయర్లను కూడా నింపాల్సిన అవసరం ఉందని అందుకోసం ఏకంగా 35.23 టిఎంసిలు అవసరం అని కొత్త లెక్కలు వినిపిస్తోంది. తెలుగుగంగ పథకంలో అంతర్భాగంగా నంద్యాల జిల్లాలో ఉన్న వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 9.5టిఎంసిలు, నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై నిర్మించిన సోమశిల రిజర్వాయర్‌లో 17.33టిఎంసిలు, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కండలేరు జలాశయంలో 8.4టిఎంసిలు నింపింతే తప్ప చెన్నైకి నీటిని సరఫరా చేసేందకు ఈ మూడు రిజర్వాయర్లలో లెవెల్స్ పర్మిట్ చేయవని తేల్చింది. అందుకోసం జూన్ నుంచి జులై మధ్య ఈ రిజర్వాయర్లను నింపుకునేందుకు 35.23 టిఎంసిలను ఎత్తిపోతల పథకం ద్వారా నింపాలని సీమ ఎత్తిపోతల పథకం తొలిదశ డిపిఆర్‌లో పేర్కొంది. ఈ నీటితోపాటు చెన్నై నగర తాగునీటి అవసరాలకు 15 టిఎంసిలు, రాయలసీమ జిల్లాల తాగునీటి అవసరాలకు 8.6 టిఎంసిలు అవసరంగా పేర్కొంది. దీంతో మొత్తం 59టిఎంసిలను జూన్ నుంచే ఎత్తిపోసుకునేవిధంగా డిజైన్లు రూపొందించింది.

పర్యావరణ అనుమతులకోసం కేంద్రంతో చర్చలు
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో అడ్డుకట్టపడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిం ది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ ఈ పథకం పనులు చేపట్టవద్దని ఎన్జీటి ఆదేశాలు ఇవ్వటంతో సీమ ఎత్తిపోతల పథకం డిజైన్ల రంగు మార్చింది. తొలిదశ కింద తాగునీటిఅవరాలను ఎరగా చూపితో పర్యావరణ అనుమతులకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News