మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఐడి తనపై నమోదు చేసిన కేసులో ఎంపి రఘరామకృష్ణరాజు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. ఎపి సిఐడి అధికారులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్ ఆదివారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.కాగా, ఎంపి రఘురామకృష్ణం రాజు శనివారం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను ఎపి హైకోర్టులో డిస్మిస్ చేసింది. మరోవైపు సిఐడి కోర్టు రఘురామకు ఈనెల 28వరకు 14రోజుల రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండడంతో వైద్య పరీక్షలకు ఆస్పత్రికి తరలించాలని సిఐడి కోర్టు ఆదేశించింది. ముదుగా, గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎంపిని వైద్య సేవల నిమిత్తం గుంటూరులోని రమేశ్ ఆసుపత్రికి తరలించమని కోర్టు తీర్పునిచ్చింది.
AP MP Raghu Ramakrishna petition in SC for bail