Monday, December 23, 2024

కాంగ్రెస్ సర్కార్ త్వరలో పతనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అక్కడ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అన్నారు. దానికి పెద్ద సమయం కూడా లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సోమవారంనాడు రాజ్యసభలో విజయసాయిరె డ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన సరిగ్గా చేయలేకపోయిందని, తెలంగాణ ఇచ్చి నా అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందన్నారు.

10 సంవత్సరాల తర్వాత అది కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారాన్ని కైవసం చేసుకుందన్నారు. కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి ఉదాహరణ అన్నారు. ఆ పార్టీ ఎపికి పెద్ద విలన్ అని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పేరిట దాన్నిప్పుడు ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఎపి కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు అడిగారని విజయసాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News