Thursday, January 23, 2025

జగన్ కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

 

AP cabinet Oath

అమరావతి: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జగన్ మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. కొత్త మంత్రులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌, వేణుగోపాల్‌కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరామ్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషశ్రీచరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, రాజన్న దొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడుదల రజని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News