Thursday, April 10, 2025

ఆ రెండు కుటుంబాల పార్టీలతో ఏపీ వెనుకబడిపోయింది

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని బీఆర్‌ఎస్ నేత రావెల కిశోర్ బాబు అన్నారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదేండ్ల కాలంలో ఆ రెండు కుటుంబాల పార్టీల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పెట్టుబడులు రావడం లేదని, ఏపిలో ప్రగతి ఇరవై ఏండ్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు.

అవినీతికి అంతులేకుండా పోయిందని, ప్రపంచంలో ఏపీ అంటేనే అపహాస్యమైపోయిందన్నారు. తెలంగాణలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతుందని, సింగపూర్, మలేషియాలను తలదన్నెలా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి కోసం వలసలు పెరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఏపి రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయని, ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News