Sunday, January 19, 2025

సాగర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసిన ఏపీ అధికారులు

- Advertisement -
- Advertisement -

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల నీటిని కుడికాల్వకు విడుదల చేశారు.

గురువారం తెల్లవారుజామున ప్రాజెక్టువద్ద ఇరు రాష్ట్రాల పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ఇంజనీర్లు గేట్లు ఎత్తి తమ ప్రాంతానికి నీళ్లు వదిలేందుకు  ప్రయత్నించారు. దీనిని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మాచర్లనుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు తనిఖీ చేసి,  ఐడీ ప్రూఫ్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News