Friday, January 24, 2025

ఎపిపిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిపిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదాయాత్ర చేపట్టారు. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు వైఎస్‌ఆర్ టిపిని ఆ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఎపి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జోరుగా సాగింది. దాన్ని నిజం చేస్తూ ఎఐసిసి వర్గాలు కూడా ఆమెకు ఎపిపిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News