- Advertisement -
అమరావతి: తెలంగాణ పోలీసులపై దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దాచేపల్లిలో రేషన్ అక్రమ తరలింపు కేసులో శ్రీనివాస్ రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడానిక గుంటూరు వెళ్లారు. దీంతో తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడి చేయడంతో పాటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎపి పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -