Monday, December 23, 2024

‘కంటివెలుగు’కు ఎపి ప్రజలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కోదాడ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి స్వరాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని జనం తెలంగాణ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఇక్కడ కంటి వెలుగు పరీక్షలు చేయించుకుని కెసిఆర్ ప్రభుత్వం తీరుతెన్నులను వేనోళ్ల పొగుడుతున్నారు. ఎపిలోని విశాఖపట్నంనకు చెందిన కల్లెంపూడి ద్వారకానాథ్, విజయలక్ష్మీ దంపతులు అభినందించారు. శుక్రవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ గ్రామంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్ని కంటి పరీక్షలు చేయించుకున్నారు.

75 సంవత్సరాల వయస్సు ఉన్న ద్వారకానాథ్ గత 10సంవత్సరాలల్లో ఎప్పుడు కంటిపరీక్షలు చేయించుకోలేదని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా కంటి వెలుగు ప్రొగ్రాంలో కంటికి పరీక్షలు చేపించుకోవటంతో ఎడమ కన్ను సరిగ్గా కనిపించకపోవటంతో ఉన్న ఇబ్బందులు గుర్తించి సరైన మం దులు, సూచనలు డాక్టర్లు చేసారని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే రెండు సార్లు కంటి ఆపరేషన్లు చేపించుకున్న కల్లెంపూడి విజయలక్ష్మీ స్థానిక ప్రభుత్వ డాక్టర్ల సూచన మేరకు అవసరమైన మందులు తీసుకున్నారు. కంటి వెలుగు లాంటి మంచి కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు, ఆరోగ్యశాఖ మం త్రి హరీశ్ రావుకు ధ్వారకానాథ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. స్థానికంగా కంటి వెలు గు ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నందుకు స్థానిక కౌన్సిలర్ మామిడి పద్మావతి, బస్తీ దవాఖాన వైద్యు డు జోత్సను సన్మానించారు. కార్యక్రమంలో మామిడి రామారావు, ఎఎన్‌ఎం నీరజ ఆశా వ ర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News