Thursday, December 26, 2024

మరోసారి విచారణకు డుమ్మా.. ఆర్జీవి ఇంటికి పోలీసులు

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విచారనకు డుమ్మా కొట్టారు. తాను విచారణకు రాలేనని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్జీవిని పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల విచారణకు రావాలని ఏపీ పోలీసులు నోటీసులు పంపగా వర్మ హాజరుకాలేనని చెప్పారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. అయినా వర్మ తీరు మారలేదు. మరోసారి విచారణకు ఢుమ్మా కొట్టారు. దీంతో సీరియస్ అయిన పోలీసులు.. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

అయితే, వర్మ ఇంటి దగ్గర లేరని.. ఎదో అత్యవసర పనిమీద ఎక్కడికో వెళ్లాడని అతని సిబ్బంది పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో వర్మ కోసం అతని ఇంటి వద్ద పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆర్జీవీ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. కాగా, వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్ లపై అనుచిత పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News