Saturday, December 21, 2024

నరసారావుపేటలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసారావుపేటలో 144 సెక్షన్ విధింపు.. నిన్న(ఆదివారం) రాత్రి అధికార పార్టీ వైసిపి, టిడిపి వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. నరసారావుపేటలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు రెండు రోజులపాటు 144 సెక్షన్ విధించారు.

ఎలాంటి ఘటనలు జరగకుండా టిడిపి, వైసిపి పార్టీ కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఘర్షణకు కారణమైన వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News