Tuesday, April 1, 2025

ఆప్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి ప్రమాణం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ గా అధికారిక లాంఛన కార్యక్రమం పూర్తి చేశారు. ఏపి అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ఆరంభ కానున్నాయి. ఆయన సమక్షంలో 175 మంది ఎంఎల్ఏలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆ తర్వాత స్పీకర్ ను శాసనసభ్యులు ఎన్నుకోనున్నారు. ఇప్పటికే స్పీకర్ గా నర్సీపట్నం ఎంఎల్ఏ అయ్యన్న పాత్రుడికి పట్టం కట్టాలని సీనియర్ నేతలు ప్రతిపాదించారు. టిడిపి అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోంది. ఇదిలావుండగా డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీ అభ్యర్థికి కేటాయించాలనుకుంటున్నట్లు వినికిడి. అందుకు నెల్లిమర్ల ఎంఎల్ఏ  లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News