- Advertisement -
అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 23,18,054కి చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,657 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఎపిలో ఇప్పటివరకు 14,729 మరణాలు సంభవించగా.. మొత్తం 23,01,668మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
AP Reports 101 New Corona Cases in 24 hrs
- Advertisement -