Saturday, November 2, 2024

అనాథ శవాన్ని మోసిన ఎస్‌ఐ శిరీషకు పోలీసుల సెల్యూట్.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ఎపి ఎస్‌ఐ శిరీషకు రాష్ట్ర పోలీసుల సెల్యూట్
పొలాల్లో పడివున్న అనాథ శవాన్ని కిలోమీటర్ వరకు మోసిన వైనం

AP SI Sirisha carried unknown dead body for 2 km

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లో చనిపోయిన ఓ గుర్తు తెలియని వృద్ధుడి శవాన్ని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కొత్త శిరీష తన భుజాలపై కిలోమీటర్ వరకు మోసి స్థానిక చారిటబుల్ ట్రస్ట్‌కు అప్పజెప్పిన వైనంపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఆమె సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్‌ఐ కొత్త శిరీష సేవలను కొనియాడుతూ సెల్యూట్ మేడమ్ అంటూ రాష్ట్ర పోలీసులతో పాటు ఎపి పోలీసులు సైతం ట్వీట్ చేశారు. ఎస్‌ఐ వృత్తిలో ఉంటూ శిరీష చేసిన సేవకి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నామని తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఎస్‌ఐ శిరీష సేవానిరతిని కొనియాడుతూ రాష్ట్ర పోలీసుల ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాలుగా వేరైనా పోలీస్ వృత్తి రెండు రాష్ట్రాల పోలీసులను ఒక్కటి చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఓ మహిళా ఎస్‌ఐ చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లో చనిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్ధానికులు బయటికి తెచ్చేందుకు నిరాకరించారు. స్థానికులు పోలీసులు కోరినా వారు స్పందించలేదు. కాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శిరీషకు సమాచారం అందడంతో వెంటనే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకుంది. అనాథ వృద్ధుడి శవం పడిఉన్న తీరుపై కంటతడి పెట్టిన ఎస్‌ఐ శిరీష వెంటనే స్పందించి వృద్థుడి శవాన్ని అక్కడి నుంచి తరలించడం ఛాలెంజ్‌గా తీసుకుని ఓ గుడ్డలో అతన్ని మృతదేహాన్ని పడుకోబెట్టి కిలోమీటర్ మేర భుజాలపై మోసుకువచ్చింది. స్థానికుల సహాయంతో ఎస్‌ఐ స్వయంగా మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లి స్థానిక చారిటబుల్ ట్రస్ట్‌కు అప్పజెప్పింది. పొలాల గట్లను కూడా లేక్కచేయకుండా ఎంతో కష్టపడి దాదాపు 2కిలోమీటర్ల వరకు అనాథ శవాన్ని మోసిన ఎస్‌ఐ శిరీష మానవీయ దృక్పథాన్ని ఎపి డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా కొనియాడారు.

AP SI Sirisha carried unknown dead body for 2 km

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News