Friday, December 20, 2024

రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో చిక్కుకున్న విద్యార్థిని (వీడియో)

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఇజల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయిన ఒక 20 ఏళ్ల విద్యార్థినిని రైల్వే పోలీసులు కాపాడారు. బుధవారం దుయం ఈ సంఘటన జరిగింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో గుంటూరు-రాయగడ ఎక్సెప్రెస్ రైలును దిగుండగా శశికళ అనే విద్యార్థిని అదుపు తప్పి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య సందులో ఇరుక్కుపోయింది.

ఎంసిఎ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థిని అన్నవరం నుంచి దువ్వాడలోని కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన జరిఇంది. వెంటనే అక్కడకు చేరుకున్న ఆర్‌పిఎఫ్ సిబ్బంది ప్లాట్‌ఫామ్‌లోని కొంత భాగాన్ని తొలగించి ఆ విద్యార్థినిని కాపాడారు. దాదాపు గంటన్నరపాటు ఆ విద్యార్థిని నరకయాతన అనుభవించింది. గాయపడిన శశికళను ఆసుపత్రికి తరలించారు. గంటన్నర ఆలస్యంగా రాయగడ ఎక్స్‌ప్రెస్ దువ్వాడ నుంచి బల్దేరింది. ఈ కారణంగా ఆ రూట్‌లో ప్రయాణించే మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News