- Advertisement -
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఇజల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థిని శశికళ గురువారం తుదిశ్వాస విడిచింది. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఇరుక్కుని మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. గుంటూరు-రాయగడ ఎక్సెప్రెస్ రైలును దిగుండగా శశికళ అదుపు తప్పి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య సందులో ఇరుక్కుపోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను షీలానగర్ లో ఉన్న కిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ రూం నంబర్ 6లో చికిత్స అందించినట్లు వైద్యులు వెల్లడించారు.
- Advertisement -