హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలురు కంటే 6.11శాతం బాలకలు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 72.26శాతంగా నమోదయ్యింది. 87.47 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది.
చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. 933 పాఠాశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా, 38 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ 03వ తేదీ నుంచి 18వరకు పదవ తరగతి పరీక్షలు జరిగాయి. కేవలం 18 రోజుల్లోనే పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 13వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అవకాశం కల్పించారు. జూన్ రెండు నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.