- Advertisement -
విజయనగరం: రాయ్‌గఢ్ ప్యాసింజర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. నిన్న(ఆదివారం) రాత్రి విశాఖపట్టణం నుంచి రాయ్‌గఢ్‌కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి జంక్షన్ వద్ద ఆగి ఉన్నప్పుడు పలాస్ ఎక్స్‌ప్రెస్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14మంది మృతి చెందగా.. పదులో సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయనగరం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాత్రిపూట కావడంతో వెంటనే సహాయక బృందాలు ఇక్కడికి చేరుకున్నా వెంటనే బోగీలలో చిక్కుపడ్డ పలువురు ప్రయాణికులను వెలికితీయలేకపొయ్యారు. సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ జరగకపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
- Advertisement -