Monday, January 20, 2025

వారితోనే మహిళల కిడ్నాప్.. పవన్ కు మహిళా కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళలు కనిపించకుండా పోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై  రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాహి యాత్రలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. మహిళలను కిడ్నాప్ చేసేందుకు వైసిపి నాయకులు వాలంటీర్ల వ్యవస్థను వాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎపి మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్‌కు నోటీసులు పంపింది.

వాలంటీర్లపై వ్యాఖ్యలకు పవన్ సమాధానం చెప్పాలని, లేదా క్షమాపణలు అయినా అడగాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. లేకపోతే.. మహిళా కమిషన్ వెంటాడుతూనే ఉంటుందని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర వాలంటీర్ల ధర్నాలు చేపట్టి, పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

Also Read: జాత్యహంకారం, కులాహంకారం ఉండేది సైకోలేకే: ఎన్‌వి రమణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News