Wednesday, January 22, 2025

మంచం మీద పడుకున్న యువతి సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంచం మీద పడుకున్న యువతి సజీవదహనమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో జరిగింది. యువతి అనుమానస్పదంగా మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముద్దపురం గ్రామంలో 13 సంవత్సరాల క్రితం ముళ్లపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొదటి భార్య వసంత చనిపోవడంతో రూపను రెండో పెళ్లి చేసుకున్నాడు. శ్రీనివాస్-వసంత దంపతులకు హారిక అనే కూతురు ఉంది. ఆమె బిటెక్ చదువుతోంది. వసంత ఆస్తి విషయంలో అత్తగారింటి వారితో అల్లుడు కోర్టులో కేసులు వేశాడు.

హారిక మంచం మీద పడుకొని కాలిపోయి అనుమానాస్పదంగా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్య్కూట్ తో హారిక చనిపోయిందని ఆమె తండ్రి, మారుతల్లి ఆరోపణలు చేస్తుంది. ఆస్తి విషయంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో హారికను చంపేశారని ఆమె అమ్మమ్మ, మేనమామ ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్, రూపను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని సిఐ సిహెచ్ అంజనేయులు, ఎస్‌ఐ రాజకుమార్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News