Sunday, December 22, 2024

నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. ఎపి యువకుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ వద్ద ఓ విద్యార్థి డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద 5 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజస్, ఓ వెయింగ్ మిషన్ తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. డ్రగ్స్ తో పట్టుబడ్డ విద్యార్థి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా లోని గన్నవరం నివాసి సాకేత్ గా గుర్తించారు.

నిందితుడు బెంగుళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాకేత్ డ్రగ్స్ ను రాజేంద్రనగర్ ప్రాంతంలో విక్రయించడానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎన్ ఢిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు? బెంగుళూరులో సాకేత్ కు డ్రగ్స్ ఎవరు ఇచ్చారు.. అనే కోణం దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News