Thursday, January 23, 2025

బిర్యానీ కోసం వెళ్లి.. 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు

- Advertisement -
- Advertisement -

భీమవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం పట్టణంలో బుధవారం దొంగలు రెచ్చిపోయారు. బిర్యానీ తనడానికి వెళ్లిన వ్యక్తి బండిలోంచి డబ్బులు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకు పోయారు.

పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన కుర్రాళ్లకు రూ.4 లక్షలు ఇచ్చి బ్యాంకులో వేయమని చెప్పగా బ్యాంక్ టైం అయిపోవడంతో రూ.80 బిర్యాని తినటానికి బైకు బయట ఆపి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు బైకు డిక్కీలోని సొమ్ము అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసిటీవి ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News