- Advertisement -
న్యూఢిల్లీ : భారతీయ వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్ లోని భిండ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ సంఘటన ఉదయం 8.45 గంటల ప్రాంతంలో జరిగింది. మామూలుగా శిక్షణ నిర్వహిస్తున్న సమయంలో స్వల్ప సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని
దాంతో పైలట్ ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర ల్యాండింగ్ చేయించారని ఐఎఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, హెలిక్యాప్టర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యం వైరల్ కావడంతో చాలా మంది హెలిక్యాప్టర్‌ను చూడడానికి గుమికూడడం కనిపించింది.
- Advertisement -