కల్లూరు : తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య అన్నారు. బుధవారం కల్లూరు ఎన్‌ఎస్పి జల వనరుల శాఖ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జల దినోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ సండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉందని, సిఎం ముందస్తు తీసుకున్న ప్రణాళికలే మార్గదర్శకంగా మారి నేడు బీడు భూములుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం పంట భూములుగా మారిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు.
ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి నలుమూలల అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యారని, తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా కూడుకుపోయిన చెరువులను మిషన్ కాకతీయ పథకం చేపట్టి రాష్ట్రంలో 2000 చెరువులను తిరిగి పునరుద్దానం చేసి నీరందించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. భారతదేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని గర్వంగా ప్రతి ఒక్క రైతు గొప్పగా చెప్పుకునే రోజు ఈ రోజు వచ్చిందని రైతులకు భరోసాగా రైతు బంధు, రైతు బీమా, కుల వృత్తుల వారికి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి తెలంగాణ రాష్ట్రం గొప్ప పథకాలను అందించి ప్రజల హృదయాల్లో నిలిచారని ఎంఎల్‌ఎ అన్నారు.
అనంతరం జల వనరుల శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పోస్టర్‌ను ఎంఎల్‌ఎ సండ్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జట్పీటిసి కట్టా అజయ్‌కుమార్, రైతు సమన్వయ సమితి సభ్యులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్‌రావు, కల్లూరు పర్యవేక్షక ఇంజినీర్ ఎం. ఆనంద్‌కుమార్, ఈఈ లక్ష్మీనారాయణ, శ్రీనివాసరెడ్డి, డిఈలు వెంకశ్వరరావు, రాజా రత్నాకర్, జెఈలు సాయిరాం, శ్రీనివాసరెడ్డి, సాంకేతిక అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.