Friday, December 20, 2024

ఆపర భగీరథుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

చిలిపిచెడ్: సిఎం కెసిఆర్ చరిత్రలో ఆపర భగీరథుడుగా నిలిచాడని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అన్నారు. రాష్ట్రా దశాబ్ది ఉత్సవాల్లో సాగునీటి వారోత్సవాల భాగంగా మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు బోనాలతో అధికారులకు నాయకులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కపుడు ఎడారిలా ఉండే తెలంగాణ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులతో జలకళ సంతరించుకుందని తెలిపారు.

సిఎం కెసిఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులు, చెరువులు నింపడంతో గ్రామలన్ని పచ్చని పంటలతో సస్యశ్యామలం అయ్యాయని అన్నారు. పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో బిఆర్‌ఎస్ హయాంలో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ కమిషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఈఈ మల్లయ్య, బిఆర్‌ఎస్ మండల అధ్యకుడు అశోక్ రెడ్డి, ఎమ్మార్వో ముసదిక్, శివ్వంపేట్ ఎంపిపి హరికృష్ణ, కొల్చారం జడ్పిటిసి మేఘమాల సంతోష్, కౌడిపల్లి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు రామగౌడ్, సర్పంచ్ పరశురాం రెడ్డితోపాటు మండల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News