Sunday, December 22, 2024

ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -

ధర్మారం: ఇంటింటికి మంచినీరు అందిస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం మంచినీళ్ల పండుగలో భాగంగా ధర్మారం మండల కేంద్రంలోని వాటర్ ఫిల్టర్ బెడ్‌ను ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు.

నీటి సరఫరా జరుగుతున్న తీరును అధికారులనుండి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,729 గ్రామాలకు మిషన్ భగీరథ కార్యక్రమం రూపొందించి, సురక్షిత నీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాగే ధర్మారం వాటర్ ప్లాంట్ ద్వారా ధర్మారం మండలంలోపాటు వెల్గటూర్ మండలానికి తాగునీటిని అందిస్తున్నామని అన్నారు.

ఉమ్మడి పాలనలో తాగునీటికి అరిగోస పడ్డామని, ప్రత్యేక రాష్ట్రంలో నీటి కొరత తీరి ప్రజలు సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చి పేద ప్రజలకు సురక్షిత తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీలు పద్మజ, సుధారాణి, సింగిల్ విండో చైర్మన్ బలరాంరెడ్డితోపాటు మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News