Sunday, December 22, 2024

అతిరుద్ర మహాయాగంలో అపశృతి

- Advertisement -
- Advertisement -
  • యాగం జరుగుతున్న సమయంలో ఎగిసిన మంటలు, కాలిపోయిన టెంట్
  • ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు

తాండూరు: అతిరుద్ర మహాయాగం ఆఖరిరోజు అపశృతి జరిగింది. పూర్ణాహుతి జరగడానికి ముందే యాగం జరిగే సమయంలో మంటలు పైకి ఎగిరాయి. దీంతో అక్కడ ఉన్న పూజా సామాగ్రి, అమ్మవారి విగ్రహాలు కాలిపోయాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్, ఎల్‌ఈడి స్కీన్, పూజ వస్తువులు కాలిపోయాయి.

హోమం నిర్వహిస్తున్న పంతుళ్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్‌ఇంజన్ అక్కడికి చేరుకుని మంటలను అదపుచేసింది. ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

స్వయంగా అమ్మవారే ఆహుతార్పణం చేయడం అద్భుతం : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

పూర్ణహుతి చేసే సమయంలో అమ్మవారే అహుతార్పణం చేయడం అద్భుతమని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఆయన నివాసంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి పీఠాధిపతులను, పూజారులను రప్పించి 11 రోజుల పాటు అతిరుద్ర మహాయాగం చేయడం జరిగిందన్నారు.

దేశం, రాష్ట్రం, తాండూరు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా కురియాలని, పంటలు బాగా పండాలని యాగం చేపట్టినట్లు తెలిపారు. 11 రోజులపాటు నిర్వహించిన అతిరుద్ర యాగంలో 12645 మంది దంపతులు పాల్గొన్నారని వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో తాండూరు ప్రాంత ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News