Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న అపోలో టైర్స్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. లండన్ తరువాత తమ రెండవ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను హైదరాబాద్ లోనే  ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కంపెనీ డిజిటల్ వ్యూహాలైన ఐఓటి, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ , రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ , బ్లాక్ చైన్ వంటి వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకుని, కొత్త వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడం, వినియోగదారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

దీంతో పాటు మార్కెటింగ్, తయారీ సామర్థ్యాలను పెంపొందించుకోవడతో పాటు కంపెనీ సప్లై చైన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునిఅనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఈ కేంద్రందే కీలక పాత్ర. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే.తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తరుపున ఐటి,పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, అపోలో టైర్స్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, ఎండి నీరజ్ కన్వర్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు.

టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ వంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు కల సంస్థలతో వినూత్న ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ తెలంగాణలో ఏర్పడిందన్న మంత్రి కెటిఆర్ అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ దీనికి సరైన జోడింపుగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లండన్ తరువాత డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు అపోలో నీరజ్ కన్వర్ కు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా అపోలో టైర్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ మాట్లాడుతూ మా FY26 విజన్ సాధించడానికి డిజిటలైజేషన్ కీలకమైనదని. లండన్‌ తరువాత హైదరాబాద్ లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం మా డిజిటల్ వ్యూహంలో భాగమని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

సంక్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో ఈ ఇన్నోవేషన్ సెంటర్ సహాయం చేసి సంస్థకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్, లండన్‌లో ఉన్న డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌లలో వ్యూహాత్మక డిజిటల్ అప్లికేషన్‌ల అభివృద్ధి కోసం ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంబంధిత ప్రభుత్వాలతో పాటు గ్లోబల్ డిజిటల్ లీడర్‌లతో అపోలో టైర్స్ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News