Friday, January 24, 2025

జగన్ సింహం… పవన్ గ్రామ సింహం: అప్పలరాజు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పగటి వేషాలు వేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అప్పలరాజు రీకౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి 2019 పాలనపై పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడడంలేదని దుయ్యబట్టారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదన్నారు. చంద్రబాబుకు పవన్ అమ్ముడు పోయారన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ సభ ఏర్పాటు చేస్తున్నారని విరుచుకపడ్డారు. బాబు ప్యాకేజీ కోసం వాళ్లు ఏది చెబితే పవన్ కల్యాణ్ అది చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌కల్యాణ్ సభలకు పేర్లు కూడా టిడిపి నిర్ణయిస్తుందన్నారు. మత్యకారుల గురించి పవన్ కల్యాణ్‌కు అవగాహన ఉందా? అని అడిగారు.

టిడిపి హయాంలో ఒక్క పిషింగ్ హార్బర్ కట్టలేదని, సిఎం జగన్ వచ్చాకా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ప్రారంభించామన్నారు. సిఎం జగన్ సింహాం లాంటి వారని, నీలాంటి గ్రామ సింహాలకు బెదరనని హెచ్చరించారు. కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబుకు పవన్ తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయం అంటే ఎంతసేపు ఊగిగం చేయడమేనా? అని అప్పలరాజు ప్రశ్నించారు. నాయకుడు కార్యకర్తల్లో స్ఫూర్తి నింపాలని, ప్యాకేజీ మాటలు మాట్లాడొద్ధని పవన్ హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధిపై చర్చకు పవన్ సిద్ధమా? అని అడిగారు. నీకు రాష్ట్రంపై ఏ స్థాయిలో అవగాహన ఉందో తేలుతుందన్నారు. చంద్రబాబును కలిసిన రోజు పవన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారని, పవన్ పార్టీ పెట్టాక ఇంతవరకు ఎంఎల్‌ఎ కాలేదన్నారు. అంబటి రాంబాబు స్థాయి ఏంటో పవన్ తెలుసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News