హత్నూర: 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్నూర మండలం వద్దు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నారం మండలం కావాలని హత్నూర మండల పరిధిలోని ఆక్వాంఛగూడ, రొయ్యపల్లి, నాగారం,షేర్ ఖాన్ పల్లి గ్రామస్తులు,ప్రజా ప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న హత్నూర మండల కేంద్రం వెళ్లడానికి నాన్న ఇబ్బందులు పడుతున్నామని,అతి సమీపంలో ఉన్న జిన్నారం మండలానికి మా గ్రామాలను కలపాలని ఎమ్మెల్యేకు మొర పెట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.గత సంవత్సరంలో కూడా ఇట్టి విషయంపై తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు.
ఇప్పటికైనా అతి సమీపంలో ఉన్న జిన్నారం మండలంలో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విషయంపై ఎమ్మెల్యే మదన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ కచ్చితంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్తానని సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తెలిపారు.ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి విట్టల్, ఎంపీటీసీ మచ్కురి భాషమ్మ ఆగమయ్య, వార్డు సభ్యులు చిట్టి శివరాజ్, బిఆర్‌ఎస్ యువ నాయకులు కోటగళ్ళ శివరామకృష్ణ, కోటగళ్ల సంజీవ, మన్నే శ్రీనివాస్, శ్రీశైలం గౌడ్, కృష్ణ స్వామి, గోపి,బాలేష, రాకేష్, మహేష్ గ్రామస్తులు తదితరులున్నారు.