- Advertisement -
న్యూయార్క్ : ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సరికొత్త ఐఫోన్ 14 మోడళ్లను అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఆవిష్కరించింది. వీటిలో మరింత ఉత్తమమైన కెమెరాలు, ప్రాసెసర్ చిప్‌లు ఉన్నాయి. గతేడాది మోడళ్ల కంటే ఇవి అత్యధిక ధరను కల్గివున్నాయి. వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్లను కంపెనీ ప్రవేశపెట్టింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ వంటి మోడళ్లను అద్భుతమైన ఫీచర్లతో అందిస్తోంది. వీటితో పాటు వాచ్ సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రొ 2 వంటి ఎలక్ట్రానికి పరికరాలను కూడా యాపిల్ విడుదల చేసింది.
- Advertisement -